Telugu first look of Pan India film Cicada Released: బాహుబలి స్పూర్తితో పాన్ ఇండియన్ సినిమాలు బాగా ఎక్కువయ్యాయి. ఒకప్పుడు తెలుగు సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కించేవారు, రిలీజ్ చేసే వారు కానీ ఇప్పుడు ఇతర భాషల్లో కూడా ఇలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే అందరినీ ఓ కొత్త కాన్సెప్ట్‌తో పలకరించేందుకు ‘సికాడా’ అనే సినిమా రాబోతోందని అంటూ ఒక ప్రకటన వచ్చింది. ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్‌తో రాబోతోన్న ఈ మూవీ విడుదలకు ముందు సంచలనాలు సృష్టించడం ఖాయమని టీమ్ బల్లగుద్ది చెబుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో సోహెల్ చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, నటీనటుల లుక్స్, గెటప్స్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిజానికి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సికాడా యూనిట్‌లో అంతా కొత్త వారేనట.
Rashmi Gautam: బాత్ టబ్లో రష్మీ గౌతమ్ టీజింగ్.. ఆ ఒక్కటి చూపించమంటున్న నెటిజన్లు
శ్రీజిత్ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాను తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వందనా మీనన్, గోపకుమార్ పి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రజిత్ సిఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్ ప్రధాన పాత్రలు పోషించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ బెంగుళూరు, అట్టపాడి, వాగమోన్, కొచ్చి తదితర ప్రాంతాల్లో జరిగిందని, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించారని చెబుతున్నారు. నిజానికి శ్రీజిత్ ఎడవనా మ్యూజిక్ డైరెక్టర్‌గా “కాదల్ ఎన్ కవియే”, “నెంజోడు చేరు” వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు సికాడాతో దర్శకుడిగా ఆయన పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమా పాటలకు రవితేజ అమరనారాయణ సాహిత్యం అందించగా నవీన్ రాజ్ కొరియోగ్రాఫర్, శైజిత్ కుమారన్ ఎడిటర్ గా పని చేశారు. అయితే ఈ సికాడా అంటే ఏంటో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే అంటున్నారు మేకర్స్.