Teja Sajja Next Project after Hanuman: చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డులు సెట్ చేసింది. ఇప్పటి వరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా గానే మొదలైంది. కానీ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్పాన్ పెరుగుతూ వెళ్ళింది. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు తేజ సజ్జ చేయబోయే తరువాతి సినిమా గురించి క్లారిటీ వచ్చేసింది. ఆయన తన తరువాతి సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈగల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని కార్తీక్ ఘట్టమనేని వెల్లడించారు.
Actress Murdered: మందుకు డబ్బివ్వలేదని కొడుకు చేతిలో నటి దారుణ హత్య
తేజతో చేయబోయే సినిమా కొంచెం మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అని దేవుళ్ళ కాన్సెప్ట్ ఉండదు కానీ హిస్టరీకి సంబంధించిన సినిమాగా ఉంటుందని కార్తీక్ ఘట్టమనేని చెప్పుకొచ్చారు. కొంచెం ఫాంటసీ మూవీలా ఉంటుందని ఆయన అన్నారు. ఇక ప్రశాంత్ వర్మ చేయబోతున్న జై హనుమాన్ సినిమాలో పూర్తిస్థాయిలో తేజ కనిపించకపోవచ్చు. లేదా తేజను ప్రధానంగా పెట్టుకుని కూడా ప్రశాంత్ వర్మ కథ రాసుకుంటూ ఉండి ఉండవచ్చు. ఆ విషయం కథ పూర్తి అయ్యాకే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మ తేజ నిర్మాత నిరంజన్ రెడ్డి సినిమాని అమెరికాలో ప్రమోట్ చేస్తున్నారు. సినిమా విడుదలై నాలుగు వారాలు పూర్తి అవుతున్నా సరే అమెరికాలో ఇంకా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో క్రేజ్ కనిస్తోంది.. దానిని మరింత పెంచేందుకు ఈ టీం అమెరికా వెళ్లి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది.