Hanuman: టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం హనుమాన్. టాలీవుడ్ లోనే మొట్టమొదటి సూపర్ హీరో సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ లో ప్రశాంత్ వర్మ చూపించిన విజువల్స్ కు అభిమానులు మంత్రముగ్దులు అయ్యారు. కొన్ని కోట్లు పెట్టినా అలాంటి విజువల్స్ తీయలేరని అభిమానులు చెప్పుకొచ్చారు. కేవలం ఒక్క టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొనేలా చేశాడు డైరెక్టర్.
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒకటి కాదు రెండు కాదు అన్ని దేశాల్లో ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమాగా అమెరికా, చైనా, స్పెయిన్, శ్రీలంక తో పాటు మిగతా దేశాల్లో కూడా అన్ని భాషల్లో మే 12 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ మ్యాప్ లో ఎక్కడెక్కడ రిలీజ్ కానుందో తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ మ్యాప్ లో హనుమంతుడి రూపంతో వచ్చిన ప్రతి దేశంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ మరో హిట్ ను అందుకుంటాడా..? లేదా అనేది చూడాలి.
#HanuManFromMay12th pic.twitter.com/SIDCSD6wns
— Teja Sajja (@tejasajja123) January 9, 2023