Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం టాక్ ఆఫ్ థ్ టౌన్ గా మారిపోయింది. గత రెండు నెలలుగా తమన్నా పేరు తప్ప ఇంకేదీ వినిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. జీ కర్దా, లస్ట్ స్టోరీస్, భోళా శంకర్, జైలర్ ఇలా తెలుగు, తమిళ్, హిందీ మొత్తాన్ని కవర్ చేసేసింది. ముఖ్యంగా హిందీ సిరీస్ లలో అమ్మడి అందాల ఆరబోతను చూసి అభిమానులు అవాక్కయ్యారు. ఆ రేంజ్ లో ఘాటు రొమాన్స్ తమన్నా ఇంతకు ముందు ఎన్నడు చేసింది లేదు. దీంతో దేవుడా.. ఏంటి తమన్నా ఎందుకు ఇంతలా రెచ్చిపోతున్నావ్ అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే తమన్నా మాత్రం.. పాత్రకు తగ్గట్టుగానే తాను చేసినట్లు చెప్పుకొచ్చింది. సరే చేస్తే చేసింది.. దీనివలన తమ్ముకు ఏమొచ్చింది.. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ రెండు ఆశించిన ఫలితం అందుకోలేకపోయాయి. అనవసరంగా అమ్మడు అంత విప్పి చూపించిది కానీ, ప్రయోజనం మాత్రం లేదు అనుకున్నారు.
Mirzapur 3: బీనా ఆంటీ మళ్లీ వచ్చేస్తుందిరోయ్ .. ఈసారి మరింత ఘాటుగా
కానీ, అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో తమ్ము.. లక్కీ ఆఫర్ పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో తమన్నా ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది. ఇటీవల తమన్నా జుహూ లోని దర్శకనిర్మాత భన్సాలీ కార్యాలయంలోకి వెళ్లి రావడం మీడియా కంట పడడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో తమ్ము మంచి ఛాన్స్ నే పట్టేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే భన్సాలీ ప్రస్తుతం తన వెబ్ సిరీస్ హీరామాండి చిత్రీకరణను ముగించి వెంటనే రణవీర్ సింగ్ తో బైజు బావ్రా షూటింగ్ ను పట్టాలెక్కించనున్నాడు. ఈ రెండింటి తరువాత తమ్ముతో సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఇదే కనుక నిజమైతే తమన్నా బాలీవుడ్ లో పాగా బాగానే వేసిందని చెప్పాలి. మరి త్వరలో అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.