Mirzapur 3: అమెజాన్ ప్రైమ్ కు నెట్ ఫ్లిక్స్ కు ఎప్పుడు పోటీ ఉంటూనే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ.. కానీ, నెట్ ఫ్లిక్స్ ఆ అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఫేమస్ అవ్వకముందే అమెజాన్ మీర్జాపూర్ సిరీస్ తో టాప్ లో ఉండేది. మీర్జాపూర్ సిరీస్ గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, ఖాలీన్ భయ్యా, బీనా ఆంటీ ఈ పేర్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. అంతలా ఈ సిరీస్ ఫేమస్ అయ్యింది. 2018 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో 9 ఎపిసోడ్లతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది. బూతు పదాలు, ఘాటు రొమాన్స్ తో అప్పట్లో పెను సంచలాన్ని సృష్టించిన సిరీస్ అంటే ఇదే. ఇక ఈ సిరీస్ లో బీనా ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఖాలీన్ భయ్యా ముద్దుల భార్య. భర్త అందించే సుఖం అందక.. పనివాడితో రొమాన్స్ చేస్తూ.. మామకు దొరికిపోతుంది. తక్కువజాతి వాడి రక్తంతో బిడ్డ పుట్టకూడదని మామనే ఆమెతో శృంగారంలో పాల్గొంటాడు. అంతటితో మీర్జాపూర్ మొదటి సీజన్ ముగుస్తోంది. ఇక సీజన్ లో సైతం అమ్మడు రెచ్చగొట్టే విధానము వేరే లెవెల్ ఉంటుంది.
Kavya Kalyanram: బాడీ షేమింగ్ రూమర్స్ .. ‘బలగం’ బ్యూటీ క్లారిటీ
ఇక బీనాగా నటించిన నటి ఎవరో కాదు రసికా దుగల్. ఈ రెండు సీజన్స్ తో ఆమె పేరు బాలీవుడ్ లో మాములుగా మోగలేదు. ఈ రెండు సీజన్స్ తోనే మీర్జాపూర్ అయిపోయింది అనుకున్నారు. కానీ, అమ్మడు ఇచ్చిన అప్డేట్ తో మూడో సీజన్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. గురుమీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ తాజాగా మూడో సీజన్ కోసం రెడీ అవుతోంది. బీనా ఆంటీ.. మూడో సీజన్ కు డబ్బింగ్ చెప్తూ కనిపించింది. మీర్జాపూర్ 3 కోసం వేచి ఉండలేకపోతున్నా అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మీర్జాపూర్ 3 త్వరలోనే రానుంది అని తెలుస్తోంది. ఇక రెండు సీజన్స్ లో బీనా ఆంటీ పాత్ర చాలా తక్కువ ఉన్నా కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక సీజన్ 3 లో అమ్మడు ఘాటు రొమాన్స్ తో పాటు మరింత రాజకీయంకూడా ఉండనుందట . మరి ఈసారి బీనా ఆంటీ ఏ రేంజ్ లో చూపిస్తోందో చూడాలి.