Swapna dutt helped in casting keerthy suresh for bhola shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అజిత్ నటించిన వేదాళంకు ఇది రీమేక్ సినిమా. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ కాగా మెగాస్టార్ చెలెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక మెలోడీ బ్రహ్మ మణి శర్మ తనయుడు మహతి స్వర సాగర్ భోలా శంకర్‌కి సంగీతాన్ని అందించగా తాజాగా మీడియాతో మాట్లాడిన మెహర్ రమేష్ ఈ సినిమా గురించి కీలకమైన విషయాలు పంచుకున్నారు.
Meher Ramesh: చిరంజీవితో రీమేక్ అంటే రిస్కని తెలిసి కూడా అందుకే చేశా!
కీర్తి సురేష్ ని చెల్లెలు పాత్రలోకి ఎలా తీసుకొచ్చారు ? అని అడిగితే మెగాస్టార్ పక్కన నటించాలి అంటే క మెగా నటి కావాలి. కీర్తిని అనుకున్న కానీ నాకు పరిచయం లేక స్వప్న దత్ గారి ద్వారా ఈ పాత్ర గురించి చెప్పడం జరిగింది. స్వప్న దత్ గారికి థాంక్స్ చెప్పాలని ఆయన అన్నారు. స్వప్న చెల్లి ద్వారా కీర్తి అనే చెల్లి దొరికిందని అన్నారు. ఈ కథ లోని ఎమోషన్ కి కీర్తి సురేష్ చాలా కనెక్ట్ అయ్యి వెంటనే చేస్తానని చెప్పారని అన్నారు. వాల్తేరు వీరయ్యలో బ్రదర్ సెంటిమెంట్ గా రవితేజ ఎసెట్ అయితే ఇందులో కీర్తి సురేష్ పాత్ర కూడా సిస్టర్ సెంటిమెంట్ గా హైలెట్ ఉంటుందని అన్నారు. అలాగే తమన్నా, సుశాంత్ ల పాత్రలు కూడా చాలా చక్కగా కుదిరాయని, పాత్రలన్నీ చాలా మంచి వినోదం పంచుతాయని అన్నారు.