Samantha : సమంత మరోసారి నెటిజన్లపై విరుచుకుపడింది. ఈ సారి సీరియస్ గా పోస్ట్ పెట్టింది. తనపై చెత్త కామెంట్స్ పెట్టే వాళ్లకు సవాల్ విసిరింది. మొన్న ముంబైలో సమంత జిమ్ నుంచి బయటకు వచ్చే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అందులో ఆమె లుక్స్ చూసి కొందరు ట్రోల్స్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఆమె మరీ అంత సన్నగా ఉండటంపై రకరకాల పోస్టులు వేసేశారు. వీటిపై తాజాగా సమంత సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టేసింది. ఇందులో ఆమె జిమ్ లో పుల్ అప్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేసింది.
Read Also : RGV : అంతా ప్రభాస్ కోసం వెళ్తున్నారు.. నేను విష్ణు కోసం వెళ్తా..
ఈ వీడియో మీద ఇలా రాసుకొచ్చింది. మనం ఒక డీల్ కుదుర్చుకుందాం. మీలో ఎవరైని ఇలా మూడు పుల్ అప్స్ చేయండి. ఆ తర్వాత నాపై సన్నబడింది, నీరసంగా ఉంది అంటూ కామెంట్ చేయండి.. ఒకవేళ మీరు చేయలేకపోతే ఇకపై నా మీద చెత్త కామెంట్స్ చేయండి ఆపేయండి అంటూ ఫైర్ అయింది. ఆమె ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అవుతోంది.
ఈ నడుమ సమంత తనపై వస్తున్న కొన్ని నెగెటివ్ ట్రోల్స్ గురించి ఇన్ డైరెక్ట్ గా స్పందించేది. ఇప్పుడు డైరెక్ట్ గానే అటాక్ చేసేసింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది. చూస్తుంటే ఈ వీడియోను కూడా ట్రోల్ చేసే అవకాశాలే ఉన్నాయి. సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే ఆమె ఓ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Read Also : Prabhas : ఆ కోటలో అడుగు పెడుతున్న ప్రభాస్.. ఎందుకంటే..!