supritha : టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదట్లో చిన్న రోల్స్ చేసిన ఆమె.. ఇప్పుడు రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ పిక్స్ షేర్ చేస్తూ హంగామా చేసే సుప్రీత.. తాజాగా ఆస్పత్రి బెడ్డుపై చేరింది. ఆమె బెడ్డుపై ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు దిష్టి తగిలిందంటూ రాసుకొచ్చింది. ‘శివయ్యను మాత్రమే నేను నమ్ముతాను. అలాంటి శివయ్యకు నా మీద కోపం వచ్చినట్టుంది.
Read Also : Allu Arjun – Atlee : బన్నీ ట్రిపుల్ రోల్.. ఈసారి అరాచకమే
అయినా శివయ్య, అమ్మ, రమణ లేకుండా నేను ఉండలేను. వారు ఉండగా నాకేం కాదు. నాకు గత వారం నుంచి బాగా దిష్టి తగిలింది. త్వరగానే కోలుకుంటాను’ అంటూ రాసింది. ఆమె చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఆమె ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలి అంటూ విష్ చేస్తున్నారు. సుప్రీత సురేఖ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఇద్దరూ రీల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత హాట్ హాట్ గా అందాలను చూపిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇప్పుడు సినిమాలు, బుల్లితెర షోలు చేస్తోంది.
Read Also : Bangladesh: షేక్ హసీనా పాత్ర పోషించిన నటి నుస్రత్ ఫరియా అరెస్ట్..