Allu Arjun – Atlee : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హిట్‌మేకర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘AA22’ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్ నటనా సత్తాను మరోస్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్‌డేట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా, అల్లు అర్జున్ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్నారనే సమాచారం బయటకు వచ్చి, అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
Read Also : Bangladesh: షేక్ హసీనా పాత్ర పోషించిన నటి నుస్రత్ ఫరియా అరెస్ట్..
ఈ సినిమా గురించి మొదట డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్ కనిపిస్తారని, ఒక పాత్రలో హీరోగా, మరొకటి నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ రెండు కాదు, మూడు పాత్రలలో నటిస్తున్నారట. మూడో పాత్ర పూర్తిగా అనూహ్యంగా, అల్లు అర్జున్ కెరీర్‌లో ఇప్పటివరకూ చూడని ‘నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్’ లుక్‌లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. మూడో పాత్రకు సంబంధించి ఇప్పటివరకూ స్పష్టమైన సమాచారం లేనప్పటికీ అట్లీ గత చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ డెప్త్‌ను అద్భుతంగా చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన ఫిట్‌నెస్, స్టైలింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మూడు పాత్రలకు తగ్గట్టుగా విభిన్న శారీరక మార్పులు, కొత్త లుక్‌లతో సిద్ధమవుతున్నారు. మూడో పాత్ర కోసం పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.