స్టార్ హీరోస్ న్యూ ప్రాజెక్ట్స్ విషయంలో ఒకటి అనుకుంటే మరోటి అవుతోంది. అనుకున్న టైమ్ కు కమిటైన ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో వచ్చిన న్యూ కమిట్మెంట్స్, ఇతర కారణాల వల్ల పట్టాలెక్కేందుకు టైం తీసుకుంటున్నాయి. సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో రావాల్సిన స్పిరిట్ ఏడాది నుండి అదిగో అప్పుడు స్టార్టవుతుంది. ఇదిగో ఇప్పుడు మొదలువుతుంది అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ.. షూటింగ్ స్టార్టైన దాఖలాలు లేవు. రాజా సాబ్ తర్వాత ఫౌజీ ఎంట్రీతో ఇది డిలే అయిందనేది వాస్తవం.
ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్ట్ కూడా ఇదే ఇష్యూ. వార్ 2 షూటింగ్ కారణంగా కాస్త లేటుగా సెట్‌లోకి అడుగుపెట్టాడు తారక్. దీంతో రిలీజ్ డేట్‌పై ఎఫెక్ట్ పడింది. ఈ రెండిటి వలన దేవర 2 కు మరింత వెనక్కు వెళ్ళింది. ఇక అల్లు అర్జున్ లీడ్ రోల్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రావాల్సి ఉంది. కానీ అట్లీ సినిమా కారణంగా త్రివిక్రమ్ ఏకంగా క్యాన్సిల్ అయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కారణంగా అయన నటిస్తున్న OG ఎన్ని సార్లు పడిందో చెప్పక్కర్లేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా ఎప్పుడో ఫినిష్ కావాల్సి ఉంది కానీ డిలే అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు నాని హై ఆక్టేన్ మూవీ ప్యారడైజ్ కూడా ఇదే బాటపడుతోంది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే చేస్తున్నాడు. స్ట్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ డిలే కావడంతో మధ్యలో హిట్ – 3 వచ్చి చేరింది. పోనీ అది ముగిసిన వెంటనే అనగా మే నెలలోనే ప్యారడైజ్ స్టార్ చేయాలనుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. కానీ ప్యారడైజ్ షూటింగ్ ఆగస్టుకు వాయిదా పడినట్లు పడింది. ఇలా ముందుకు అనుకున్నకమిట్మెంట్స్ కారణాల వలన షూటింగ్స్ డిలే అయ్యేయి కొన్ని అయితే బడ్జెట్స్ కారణంగా మరికొన్ని వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి.