SSMB 29 : దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా ముందస్తు ప్లాన్ తోనే చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమా కోసం భారీ ప్లాన్ చేస్తున్నాడంట. ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ మూవీతో ఒకటి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంకోదానిపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే తెలుగు నిర్మాణ సంస్థలతో మూవీ చేస్తే ప్రతిసారి ఫారిన్ కేటగిరీలో నామినేషన్స్ వేయాల్సి వస్తోంది. అప్పుడు ఆస్కార్ అవార్డుల అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మహేశ్ తో చేస్తున్న మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
Read Also : Allu Arjun : ఫ్యామిలీతో అల్లు అర్జున్.. లేటెస్ట్ పిక్ చూశారా..
తెలుగు బ్యానర్ మీద కాకుండా హాలీవుడ్ బ్యానర్ ను మెయిన్ నిర్మాణ సంస్థగా చూపించేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నారంట. అందుకోసం హాలీవుడ్ కు చెందిన నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థను మొదటి ప్రొడ్యూసర్ గా చూపించి కేఎల్ నారాయణను రెండో సంస్థగా చూపించవచ్చు. అలా చేస్తే మూవీ హాలీవుడ్ కోటాలో నేరుగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయొచ్చు. అప్పుడు ఎక్కువ విభాగాల్లో ఆస్కార్ కు నామినేషన్స్ వేయొచ్చు. కాకపోతే మూవీ షూట్ ను డైరెక్ట్ గా ఇంగ్లిష్ లో చేయాలి. అదేమంత పెద్ద కష్టం కాకపోయినా.. కొంత బడ్జెట్ పెరుగుతుంది. ఆ లెక్కలు అన్నీ కార్తికేయ చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే దీనిపై అనౌన్స్ మెంట్ వస్తుంది.
Read Also : Prasad Babu : నా కొడుకు చనిపోవాలని కోరుకున్నా.. సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్