#SSMB28 #Pandugaadubackinaction అనే రెండు టాగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఉన్నపళంగా మహేశ్ ఫాన్స్ ట్విట్టర్ ని షేక్ చెయ్యడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా టైటిల్, రెండోది ఒక ఫ్యాన్ అకౌంట్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన మహేశ్-త్రివిక్రమ్ సినిమాకి ‘ఆరంభం’, ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్స్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ కి ఉన్న ‘అ’, ‘ఆ’ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ‘ఆరంభం’, అయోధ్యలో అర్జునుడు’ టైటిల్స్ లో ఒకదాన్ని ఫైనల్ చేస్తాడని ఫాన్స్ లో చర్చ నడుస్తుంది. ఉగాది రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి, ఆ రోజే టైటిల్ ని కూడా మేకర్స్ రివీల్ చేస్తారని ఘట్టమనేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది రోజున మహేశ్ బాబు-త్రివిక్రమ్ లు ఎలాంటి టైటిల్ తో SSMB 28 సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తారో చూడాలి. ఆగస్ట్ 11న రిలీజ్ కానున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఫ్యాన్ అకౌంట్ విషయానికి వస్తే… మహేశ్ ఫాన్స్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యి, మహేశ్ బాబు సినిమాల ఎడిట్స్ ని పర్ఫెక్ట్ గా చేసి ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ ఇవ్వడంలో ‘పండుగాడు’ అనే అకౌంట్ ముందుంటుంది.
ఇతర హీరోల అభిమానులు రిపోర్ట్ కొట్టడంతో ‘పండుగాడు’ అనే అకౌంట్ అయిదు సార్లు సస్పెండ్ అయ్యింది. తాజాగా ‘పండుగాడు 2.0’ అంటూ ఆ ఫ్యాన్ అకౌంట్ మళ్లీ ఓపెన్ అవ్వడంతో ఘట్టమనేని అభిమానులంతా ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఒక హీరోకి ట్రెండ్ చెయ్యడం ఎన్నోసార్లు చూసాం కానీ ఆ హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ఒక ఫ్యాన్ కోసం కూడా ట్రెండ్ చెయ్యడం చూడడం ఇదే మొదటిసారి. SSMB 28, SSMB 29 ఇలా మహేశ్ బాబు సినిమాలకి సంబంధించిన వార్తలు ఇకపై పాన్ ఇండియా స్థాయిలో బయటకి రానున్నాయి కాబట్టి మహేశ్ ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో అలర్ట్ అవుతున్నారు. సస్పెన్షన్ లో ఉన్న అకౌంట్స్ అన్ని రివైవ్ చేసుకోని, ట్విట్టర్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చెయ్యడానికి రెడీ అయ్యారు. మరి రాబోయే రోజుల్లో ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో ఏ రేంజ్ సందడి చెయ్యబోతున్నారో చూడాలి.