అగ్ర సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఏమాత్రం విరామం లేకుండా పెద్ద సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చి సంగీత ప్రియులను అలరించడానికి పని చేస్తున్నాడు. ప్రస్తుతం థమన్ భారీ ప్రాజెక్ట్‌ల కోసం పని చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”, పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమాలపై దృష్టి పెట్టాడు. అయితే తాజాగా టాప్ కంపోజర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు థమన్ ఐసోలేషన్ లో ఉన్నాడు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి థమన్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పబ్లిక్ ఈవెంట్ లు, ఫంక్షన్లలో కూడా ఆయన మాస్క్ ను ధరించే ఉన్నారు. ఆయన రెండ్రోజుల రోజుల క్రితం నటులు శివకార్తికేయన్, నవీన్ పోలిశెట్టి, దర్శకుడు అనుదీప్‌లను కలిశారు.
Read Also : ఓటిటి అలర్ట్ : ఈరోజు మూడు పెద్ద సినిమాలు
ఇక కరోనా వైరస్ బారిన పడుతున్న సెలబ్రిటీల జాబితా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా మహేష్ బాబుకు కరోనా పాజిటివ్‌గా రాగా ఆయన కోలుకుంటున్నారు. మంచు లక్ష్మీ, విశ్వక్ సేన్ తదితరులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు థమన్ అభిమానులు, సెలెబ్రిటీలు ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
God bless ❤️ pic.twitter.com/b7a5CCnYbv
— thaman S (@MusicThaman) January 7, 2022