ఓటిటి అలర్ట్ : ఈరోజు మూడు పెద్ద సినిమాలు

ఈరోజు ఓటిటిలో మూడు ఆసక్తికర సినిమాలు విడుదల అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చాక చాలా మంది సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా టెన్షన్ ఏమాత్రం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో హ్యాపీగా సినిమాలను చూడొచ్చు. అయితే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇంట్లో రాదనే వారూ లేకపోలేదు లెండి. అది వేరే విషయం. ఇక మ్యాటర్ లోకి వస్తే… ఈరోజు మూడు పెద్ద సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన భారీ చిత్రం “పుష్ప”. పాన్ ఇండియా సినిమా “పుష్ప” ఈరోజు అంటే జనవరి 7వ తేదీన రాత్రి 8 గంటల నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.

Read Also : ఏపీ సీఎం జగన్ కు ఆర్జీవీ హెచ్చరిక

ఇక యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రెండు ఇంటరెస్టింగ్ మూవీస్ కూడా ఈరోజే పలు పాపులర్ ఓటిటీల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల థియేటర్స్ లో విడుదలైన నాగశౌర్య చిత్రాలు “వరుడు కావలెను”, “లక్ష్య” రెండూ ఈరోజు ఓటిటి లో ప్రీమియర్ అవుతున్నాయి. “వరుడు కావలెను” ZEE5 ఎక్స్‌క్లూజివ్ రిలీజ్ అయితే, “లక్ష్య” ఆహాలో రిలీజ్ కానుంది. ఈ మూడు తెలుగు చిత్రాలు తెలుగు ఓటిటి ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయో.. లేదో చూడాలి.

Related Articles

Latest Articles