సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్స్ లో హ్రితిక్ రోషన్ కనిపించినప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్ 2 గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మిషన్ కోసం రెడీ అయిన హ్రితిక్ రోషన్, దేవరలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ లేకుండా అయాన్ ముఖర్జీ వార్ 2లోని కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి హ్రితిక్ అండ్ ఎన్టీఆర్ కూడా షూటింగ్ జాయిన్ అవ్వనున్నారు. దీంతో సోషల్ మీడియాలో వార్ 2 ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ షకల్ మార్చేయ్యగల ఈ సినిమా కోసం మూవీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.
ఈ స్పై యాక్షన్ ఫిల్మ్ లో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. డిపెండబుల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న అలియా భట్ ‘వార్ 2’లో యాక్షన్ రోల్ ప్లే చేస్తుందని అంతా అనుకుంటున్నారు. అలియా భట్ ఇప్పటివరకూ యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ ప్లే చెయ్యలేదు కాబట్టి వార్ 2లో ఆమె ఉంటే బాగుటుందని మేకర్స్ భావిస్తున్నారట. అలియాతో పాటు కియారా అద్వానీ పేరు కూడా వినిపించడం స్టార్ట్ అయ్యింది. ఈ ఇద్దరు వార్ 2 సినిమాలో ఉంటారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో కియారా మాత్రం ఎన్టీఆర్ కి జోడిగా కనిపించనుందని టాక్. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్-అలియా భట్ కలిసి నటించారు. ఆ తర్వాత కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాలో అలియా భట్ నటించాల్సి ఉంది కానీ మిస్ అయ్యింది. ఇప్పుడు వార్ 2లో అయినా ఎన్టీఆర్-అలియా పెయిర్ గా నటిస్తే చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి అసలు మేకర్స్ ఏం ప్లాన్ చేసారు? ఎన్టీఆర్-అలియానా లేక ఎన్టీఆర్-కియారా అనేది చూడాలి.