SP Charan moves to court against Tharun Bhascker: దర్శకుడు తరుణ్ భాస్కర్‌పై గాయకుడు-నటుడు-నిర్మాత, లెజెండరీ సింగర్ ఎస్‌పి బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్‌పి చరణ్ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన తెరకెక్కించిన కీడా కోలా సినిమాలో ఒక పాట కోసం AIని ఉపయోగించి ఎస్‌పి బాలసుబ్రమణ్యం వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి కుటుంబ అనుమతిని అడగకపోవడంతో ఎస్‌పి చరణ్ కోర్టుకు వెళ్లాడు. సినిమాలో SPB ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన వాయిస్‌ని ఉపయోగించినందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు ఇతరులపై అతను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు . కాపీరైట్ చట్టాల ప్రకారం, వాణిజ్య ప్రయోజనాల కోసం ఏదైనా రూపంలో అతని వాయిస్ ఉపయోగించినట్లయితే సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యుల సమ్మతి (కళాకారుడు జీవించి లేకుంటే) తీసుకోవాలి.
Vidya Balan: విద్యాబాలన్ పేరుతో ఫేక్ అకౌంట్.. పోలీసులను ఆశ్రయించిన నటి..
SP చరణ్ డిమాండ్ చేస్తున్న దాన్ని బట్టి కీడా కోలా నిర్మాతలు ఎస్‌పి బాలసుబ్రమణ్యం కుటుంబానికి నష్టపరిహారం కింద రూ. 1 కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, అలాగే రాయల్టీ డబ్బుతో పాటు ఒక అపాలజీ కూడా డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో కాపీరైట్ చట్టాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరగనుంది. ‘శ్రీమంతుడు’ కాపీరైట్ సమస్య ఓ కొలిక్కి రావడానికి ఆరేళ్లు ఎలా పట్టిందో ఇటీవలే చూశాం. ‘ కీడ కోలా’లో తరుణ్ భాస్కర్ , బ్రహ్మానందం , చైతన్య రావు , రాగ్ మయూర్ , జీవన్ కుమార్ తదితరులు నటించారు . ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎప్పుడో పూర్తి కాగా ఇప్పుడు ఆహా ఓటీటీలో ప్రసారం అవుతోంది.