Vidya Balan: విద్యాబాలన్ పేరుతో ఫేక్ అకౌంట్.. పోలీసులను ఆశ్రయించిన నటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ సెలెబ్రేటిల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడమో, ఫేక్ అకౌంట్ లను క్రియేట్ చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది.. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ పేరుతో నకిలీ అకౌంట్ ను క్రియేట్ చేశారని ఆమె పోలీసులను ఆశ్రయించింది..ఆమె పేరుతో జరుగుతోన్న మోసాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. విద్యాబాలన్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసి కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ దారుణం ఇప్పుడు వెలుగులోకి రావడంతో విద్యాబాలన్ పపోలీసులను ఆశ్రయించింది. చాలా రోజులుగా జరుగుతున్న మోసం గురించి నటికి ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది విద్యా బాలన్. ఈ నేపథ్యంలోనే ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన దుండగులు ప్రజలను మోసం మోసం చెయ్యనున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది..
Also Read
సినీ పరిశ్రమలోని ప్రముఖులను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా విద్యాబాలన్ పేరుతో మోసం జరుగుతోందని ఓ కాస్ట్యూమ్ డిజైనర్‌కు తెలిసింది. ఆ విషయాన్ని నటికి తెలిజేశారు. వెంటనే అప్రమతమైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. భూల్ భూలయ్య 3′ చిత్రానికి సంతకం చేసింది.. 2007లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భూల్ భూలయ్య’లో ప్రధాన పాత్ర పోషించిన విద్య సీక్వెల్ లో మాత్రం మిస్ అయ్యింది..
Bollywood actress Vidya Balan lodged an FIR against an unknown person for creating a fake Instagram account in her name and asking for money from people. An unknown person who created an identical Instagram ID asked people for money by assuring them of jobs. Khar Police has…
— ANI (@ANI) February 21, 2024
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!