SP Charan moves to court against Tharun Bhascker: దర్శకుడు తరుణ్ భాస్కర్‌పై గాయకుడు-నటుడు-నిర్మాత, లెజెండరీ సింగర్ ఎస్‌పి బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్‌పి చరణ్ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన తెరకెక్కించిన కీడా కోలా సినిమాలో ఒక పాట కోసం AIని ఉపయోగించి ఎస్‌పి బాలసుబ్రమణ్యం వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి కుటుంబ అనుమతిని అడగకపోవడంతో ఎస్‌పి చరణ్ కోర్టుకు వెళ్లాడు. సినిమాలో SPB ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన వాయిస్‌ని ఉపయోగించినందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు…
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఈ వీకెండ్ నాని ధూమ్ ధామ్ హంగామా చేశాడు. అతనికి ఎస్పీ చరణ్ తోడయ్యాడు. వీరంతా కలిసి మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు.
SP Charan Birthday special: గానగంధర్వుడుగా జనం మదిలో నిలచిన యస్.పి.బాలసుబ్రహ్మణ్యం వారసుడు యస్.పి.చరణ్ సైతం నాన్న బాటలోనే పయనిస్తున్నారు. గాయకునిగా, నటునిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా, సంగీతకళాకారుల పోటీలో న్యాయనిర్ణేతగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు బాలు. ఆయన చూపిన దారిలోనే చరణ్ సైతం సాగుతున్నారు. ఇప్పటికే నటునిగా, గాయకునిగా, నిర్మాతగా అలరించిన చరణ్, తన తండ్రిలాగే పాటల పోటీలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. మునుముందు మరిన్ని ప్రక్రియల్లోనూ తన బాణీ పలికించి తండ్రికి తగ్గ తనయుడు…
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే చాలు తన పాటలతో అందరిని అలరించి.. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. కానీ.. 2020లో బాలు కరోనాతో మృతి చెందారు. అయితే ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయాకుడనే విషయం అందరికీ తెలిసిందే.. ఎస్పీ బాలు వారసుడిగా ఇండస్ట్రీలో చరణ్ అడుగుపెట్టాడు. నిర్మాతగా, సింగర్‌గా, దర్శకుడిగా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు చరణ్. అయితే స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే…
తల్లిదండ్రులు భౌతికంగా దూరమైనా… ప్రతి రోజు మనం చేసే పని, ప్రవర్తనతో వారిని తలుచుకుంటూనే ఉంటాం. గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసి ఎనిమిది నెలలు గడిచిపోయింది. అయినా ఇవాళ్టికీ కోట్లాది మంది పెదవులపై ఆయన పాడిన పాటలు అనునిత్యం పల్లవిస్తూనే ఉన్నాయి. అయితే… ఆయన లేని లోటును ఎక్కువగా ఫీల్ అయ్యేది ఖచ్చితంగా ఆయన కుమారుడు ఎస్పీ చరణే! అతను ఏం చేసినా… తండ్రి ఉన్నప్పుడు – లేనప్పుడు అందులో వ్యత్యాసాన్ని బాగా పోల్చుకుంటున్నట్టు…