మురారి చిత్రంతో తెలుగు తెరకు బంగారు కళ్ల బుజ్జమ్మ గా మారిపోయింది సోనాలి బింద్రే. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోలందరి సరసాన్న నటించి మెప్పించిన ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్తను వివాహమాడి సినిమాలకు దూరమయ్యింది. ఇక మధ్యలో ఆమె క్యాన్సర్ బారిన పడడం విచారకరం.. ఎంతో కష్టపడి ఆ మహమ్మారి వ్యాధితో పోరాడి బయటికి వచ్చి నిజమైన యోధురాలిగా నిలిచింది. ఇక ప్రస్తుతం సోనాలి బాలీవుడ్ లో పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి సోనాలి.. ఎన్టీఆర్ 30 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయడం, అది కాస్తా వైరల్ గా మారడం తెలిసిందే.. ఇక తాజాగా సోనాలి నటిస్తుంది అన్న వార్తలకు ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సోనాలిని ఈ విషయం అడగగా ఆమె ఆశ్చర్యపోయారు. ” ఏంటీ నేనా..? మీరు అంటున్నది నిజమేనా..? నాకు ఈ విషయం ఇప్పటివరకు తెలియదు.. పొరపాటున వేరేవారిని అనబోయి నన్ను అనుకున్నారేమో ఒక్కసారి చూడండి.. నా దగ్గరకు అయితే ఎవరు రాలేదు.. నన్ను సంప్రదించలేదు. ఇవన్ని తప్పుడు వార్తలు” అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ చిత్రంలో సోనాలి ఉంది అన్న మాటలు పుకార్లే అని తేలిపోయింది. ఏదిఏమైనా ఆమె ఉంది ఉంటే బావుండు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడైనా కొరటాల ఈ విషయం గురించి ఆలోచించి సోనాలిని తీసుకోవచ్చు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.