Kiccha Sudeep : నా రెస్పాన్స్ కన్నడలో అయితే… హీరోల ట్విట్టర్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్, శాండల్ వుడ్ మధ్య భాషకు సంబంధించి ట్వీట్స్ వార్ నడుస్తోంది. ఒకానొక సందర్భంలో కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ ఇకపై హిందీ ఎంతమాత్రం జాతీయ భాష కాదని చేసిన వ్యాఖ్యలు ఈ వార్ కు తెర తీశాయి. సుదీప్ ట్వీట్ కు లైన్లోకి వచ్చిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హిందీ భాష కాదంటే, మీ సినిమాలను ప్రాంతీయ భాషలోనే కాకుండా హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అది మొదలుకొని ఇద్దరు హీరోల మధ్య సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ చర్చే నడిచింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య నడిచిన ఆ చర్చ వైరల్ అవుతోంది.
Read Also : Bahubali : ఐదేళ్ళు… చెక్కుచెదరని ‘బాహుబలి-ద కంక్లూజన్’!
Also Read
అజయ్ ట్వీట్ కు స్పందించిన సుదీప్ “మన దేశంలోని ప్రతి భాషను నేను ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తిగా భిన్నమైన సందర్భంలో చెప్పాను. అది మీ దగ్గరకు వేరే రకంగా చేరింది. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. అప్పుడు అసలేం జరిగిందో మీకు వివరిస్తాను. ఇది ఎవరినీ బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఇలాంటి చర్చను ప్రారంభించడానికి కాదు. ఇక ఈ అంశం ఇక్కడితో ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. మీరు హిందీలో పంపిన టెక్స్ట్ నాకు అర్థమైంది. అందరం హిందీని గౌరవిస్తాము. కాబట్టి హిందీని ప్రేమించాము, నేర్చుకున్నాము. మరి నేను కన్నడలో టెక్స్ట్ చేసి ఉంటే పరిస్థితి ఏంటా? అని ఆలోచిస్తున్నాను. మేము కూడా భారతదేశానికి చెందినవాళ్లమే కదా సార్. అనువాదం, వివరణలు, దృక్కోణాలు అసలు మేటర్ సర్… పూర్తి విషయం తెలియకుండా స్పందించకపోవడానికి కారణం అదే… దీనికి నేను మిమ్మల్ని నిందించను. ఒక సృజనాత్మక కారణంతో నేను మీ నుండి ట్వీట్‌ను స్వీకరించి ఉంటే బహుశా అది సంతోషకరమైన క్షణం అయ్యేది” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.
వెంటనే అజయ్ రిప్లై ఇస్తూ “హాయ్ కిచ్చ సుదీప్, మీరు నా స్నేహితుడు. అపార్థాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు. నేను ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీని ఒక్కటిగానే భావిస్తాను. మేము అన్ని భాషలను గౌరవిస్తాము. ప్రతి ఒక్కరూ మన భాషను కూడా గౌరవించాలని మేము ఆశిస్తున్నాము. బహుశా అనువాదంలో ఏదో మిస్టేక్ జరిగింది” అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అపార్థాలు తొలగి, ఈ వివాదానికి తెర పడినట్టే కన్పిస్తోంది.
Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
And sir @ajaydevgn ,,
I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi.
No offense sir,,,but was wondering what'd the situation be if my response was typed in kannada.!!
Don't we too belong to India sir.
🥂— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
Translation & interpretations are perspectives sir. Tats the reason not reacting wothout knowing the complete matter,,,matters.:)
I don't blame you @ajaydevgn sir. Perhaps it would have been a happy moment if i had received a tweet from u for a creative reason.
Luv&Regards❤️ https://t.co/lRWfTYfFQi— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్‌గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్‌లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!