Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత భర్త వీరపనేని రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సునీతను వివాహం చేసుకున్నాకా ఆయన కూడా సెలబ్రిటీగా మారిపోయారు. ఇక తాజాగా రామ్ వీరపనేనికి బెదిరింపు కాల్స్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై రామ్.. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజుల క్రితం రామ్ కు కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి.. తాను సినీ నిర్మాతల కౌన్సిల్ సభ్యుడిని అని చెప్పి.. మీట్ అవ్వాలని కోరాడు. అయితే రామ్ బిజీగా ఉండడంతో ఏదైనా బిజినెస్ వ్యవహారమని తమ స్టాఫ్ తో మాట్లాడమని తెలిపాడు. అయినా అతడు వదలకుండా నిత్యం ఫోన్లు చేసి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో రామ్ అతడిని బ్లాక్ చేయగా.. వేరే వేరే నంబర్స్ నుంచి కాల్స్ చేసి విసిగిస్తున్నాడు.
Allu Arjun: చరణ్ భార్యపై ప్రేమ కురిపించిన బన్నీ.. ఇది కదా కావాల్సింది
ఇక ఈ మధ్య కాలంలో ఫోన్లు చేసి వ్యక్తిగతంగా కలువకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన రామ్ .. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీరి ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అసలు ఇంతకు అతను ఎవరు..? ఏంటి అనే వివరాలు మరికొన్నిరోజుల్లో పోలీసులు తెలియజేయనున్నారట.