Kalpana: ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. ఎవరో చెప్పినట్లు అలలు లేని సముద్రం.. కష్టాలు లేని జీవితం ఉండదు అన్నట్లు.. ప్రతి మనిషి జీవితంలోనూ ఆటుపోట్లు ఉంటాయి. వాటికి ఎదురునిలబడి పోరాడితేనే గెలుపు సొంతమవుతుంది. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అలా గెలిచి నిలబడినవారే. అందులో సింగర్ కల్పన ఒకరు. సింగర్ కల్పన గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె వాయిస్ తో ఎంతోమందిని మంత్ర ముగ్దులను చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోదాదాపు 3 వేలకు పైగా పాటలు పాడి మెప్పించిన కల్పన జీవితం ఒక ముళ్ల బాట అని చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన గతాన్ని తలుచుకొని బాధపడ్డారు.ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని కూడా అనుకున్నరట.
“నేను 25 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను. నాకు ముగ్గురు పిల్లలు.. నా తలరాత బాగోలేకో ఏమో 2010 లో నా భర్తతో విడిపోయాను. పిల్లలను చదివించాలి. ఒక్క అవకాశం లేదు. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. ఆ సమయంలో చిత్రమ్మ ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా..? అంటూ ధైర్యం నూరిపోసి ఇక్కడ పోటీ జరుగుతోంది.. అందులో పోటీ చెయ్ అని చెప్పింది. నిజంగానే నేను అందులో పోటీ చేశా.. ఎలాగైనా ఈ పోటీలో గెలిచి విల్లా గెలవాలనుకున్నాను. కొంతమంది ఇండస్ట్రీ పరువు తీస్తుంది అని చెప్పుకొచ్చారు. మా అమ్మానాన్నలకు ఫిర్యాదు చేశారు. ఇవేమి పట్టించుకోకుండా కష్టపడి ఆ పోటీలో గెలిచాను. చీకటిలో ఒంటరి పోరాటం చేశాను. ఆ విజయం తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం నా ముగ్గురు పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కల్పన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.