Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. టిల్లు స్క్వేర్ తో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు జాక్ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ఇది రొమాంటిక్ యాంగిల్ లో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత తమ ఇంట్లో కూడా ఎమ్ ఎస్ చేయడానికి యూఎస్ వెళ్లాలని చెప్పినట్టు తెలిపాడు. ప్రతి ఇంట్లో బీటెక్ తర్వాత అమెరికా వెళ్లడానికి ప్లాన్లు చేస్తుంటారు. అలాగే తమ ఇంట్లో కూడా చేసినట్టు తెలిపాడు.
Read Also : Bhumana Karunakar Reddy: పాపవినాశనం ఘటనపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదు..
‘మా ఇంట్లో వాళ్లు యూస్ ప్లాన్ నాకు చెప్పారు. ఓ రూ.20లక్షలు అప్పు చేసి యూఎస్ కు పంపిస్తామన్నారు. అక్కడ మూడు రోజులు కాలేజీకి వెళ్లాలని.. మిగతా రోజులు బర్గర్ షాపులో పనిచేసి అప్పులు కట్టాలన్నారు. అది నాకు అస్సలు నచ్చలేదు. బర్గర్ షాపులో పనిచేయడానికి యూఎస్ వెళ్లడం అవసరమా అనిపించింది. అందుకే ఇక్కడే ఉండిపోయా. మొదట్లో ఓ ఆన్ లైన్ ఆడిషన్ కు అటెండ్ అయ్యా. అనుకోకుండా అందులో ఛాన్స్ వచ్చింది. తర్వాత సినిమాల్లో చిన్న వేషాలు ఇచ్చారు. ఎందుకో యాక్టింగ్ లోనే ఉండిపోవాలి అనిపించింది. అదే ఇప్పుడు ఇక్కడ ఉంచింది’ అంటూ చెప్పుకొచ్చాడు సిద్ధు. జాక్ తో మరో హిట్ అందుకుంటాడా లేదా అన్నది మాత్రం చూడాలి.