Shyamali De : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమోరు గురించి చాలా రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తరచూ బయట కనిపిస్తున్నారు. అప్పట్లో శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేశారు. అప్పటి నుంచే డేటింగ్ రూమర్లు ఊపందుకున్నాయి. వ్యక్తిగతంగా వీరిద్దరూ వాటిని ఖండించట్లేదు. ఇలాంటి టైమ్ లో రాజ్ నిడుమోరు భార్య శ్యామాలి షాకింగ్ పోస్టులు చేస్తోంది. తాజాగా మరో పోస్టుతో సంచలనం రేపింది. ఈ సారి నమ్మకం అనే దాని మీద పోస్టు చేసి అందరినీ డైలమాలో పడేసింది.
Read Also : Malavika: ప్రభాస్ బాగా మాట్లాడతారు!
‘నమ్మకం అనేది చాలా విలువైనంది. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి సంపాదించుకోలేరు’ అంటూ చెప్పింది. ఆమె చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజ్-సమంతల రిలేషన్ ను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి కామెంట్ చేసిందేమో అంటున్నారు. గతంలోనూ ఇలాంటి పోస్టు చేసింది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది అనే పోస్టు కూడా చేసింది.
మరీ ముఖ్యంగా రాజ్ సమంతల డేటింగ్ రూమర్లు ఎక్కువైనప్పటి నుంచే ఆమె ఇలాంటి పోస్టులు చేస్తూ అందరినీ ఆలోచింపజేస్తోంది. వీరిద్దరి డేటింగ్ పై ఆమె నేరుగా స్పందించట్లేదు. ఒకవేళ నిజం కాకపోతే అవి రూమర్లు అని కూడా కొట్టి పారేయట్లేదు. మొత్తానికి ఈ వ్యవహారం మంచి హాట్ టాపిక్ గా మారుతోంది.
Read Also : Shekar Kammula : అలా చేసి కోట్లు నష్టపోయా..