Shekar Kammula : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి శేఖర్ బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనేక విషయాలను ఆయన బయట పెడుతున్నాడు. కేవలం మూవీ గురించే కాకుండా ఇతర విషయాలను కూడా పంచుకుంటున్నాడు. తాజాగా తన రెమ్యునరేషన్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టాడు శేఖర్ కమ్ముల. నేను ఎన్నడూ మంచి సినిమాలు తీయాలని మాత్రమే ఆలోచిస్తా.
Read Also : Kuberaa : ఆంధ్రప్రదేశ్ లో ధనుష్ ‘కుబేర’ సినిమా టిక్కెట్ రేట్లు పెంపు
ప్రేక్షకులకు నా మూవీలు ఎంత నచ్చితే అంత సంతోషిస్తా. అంతేగానీ మూవీ కలెక్షన్లలో జోక్యం చేసుకోను. నా సినిమాలు పెద్ద హిట్ అయితే పర్సెంటేజీ కావాలని ఎన్నడూ అడగలేదు. కేవలం రెమ్యునరేషన్ ఇంత కావాలని మాత్రమే అడుగుతా. దాని వల్లే నేను కోట్లు నష్టపోయా. అయినా సరే ఇప్పటికీ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నా.
చాలా మంది తమ సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం ఉంటే కచ్చితంగా పర్సెంటేజీలు తీసుకుంటారు. అది చాలా కామన్. కానీ నేను అలా కాదు. కేవలం సినిమా గురించి మాత్రమే తపనపడుతుంటా. కుబేర మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు’ అంటూ తెలిపాడు శేఖర్ కమ్ముల.
Read Also : Keerthi suresh : ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ రిలీజ్..