కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే.. ఒక పక్క ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తున్న అమ్మడు.. మరోపక్క చిరు సరసన మెగా 154 లో.. బాలయ్య సరసన ఎన్ బీకే 107 లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ల గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు.. విభిన్నమైన డ్రెస్ లో.. డిఫరెంట్ ఫోజులలో పిచ్చెక్కిస్తుంది.. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు శృతికి మంత్రగత్తె అనే బిరుదును కూడా ఇచ్చేశారు. ఇక తాజాగా శృతిని ఒంటికన్ను రాక్షసిని చేసేశారు. ఎందుకంటే అమ్మడు పెట్టిన ఫోటో అలాంటిది.. తాజాగా శృతి తన ఇన్స్టాగ్రామ లో ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో జుట్టంతా ఒక కన్ను మీద పడేసి ఒంటి కన్ను కనిపించేలా బ్లాక్ అండ్ వైట్ లో భయపెడుతూ కనిపించింది.
ఒక్కసారిగా ఆ ఆఫోటోను కనుక చిన్నపిల్లలు చూస్తే.. అమ్మో..బూచి అనక మానరు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అంతకుముందు లానే మరోసారి నెటిజన్లు ఈ ఫోటోపై విరుచుకుపడ్డారు. ఓ ఒంటికన్ను రాక్షసి.. ఎవరిని భయపెడుతున్నావ్.. అని కొందరు.. మరికొందరు శృతి నువ్వు నార్మల్ గా ఫోటోలు దిగడం మానేశావా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ఫోటోలు పెట్టడం వెనుక కారణం ఏంటి..? అనేది అమ్మడికే తెలియాలి.