బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శిల్పాశెట్టి భర్తగా, వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్న రాజ్ కుండా పోర్నోగ్రఫీ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బైత్ మీద బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదంతో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి పరువు నడిరోడ్డు మీద పడింది. దీంతో కొన్నిరోజులు శిల్పాశెట్టి మీడియాకు దూరంగా ఉంది. ఇక భర్త రాజ్ కుంద్రా బయటికి వచ్చాకా తమపై ఆరోపణలు చేసిన వారిపై పరువురు నష్టం దావా వేశారు.
ఇక తాజాగా రాజ్ కుంద్రా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఉచ్చులో బిగుసుకున్న రాజ్ కుంద్రా వివాదాలు ఎక్కువ కావడంతో తన సోషల్ మీడియా అకౌంట్స్ ని డిలీట్ చేశాడు. ఇకపై తాను సోషల్ మీడియాకు దూరం అయినట్లు చెప్పకనే చెప్పాడు. దీంతో నెటిజన్లు రాజ్ కుంద్రాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ పని చేస్తే మాత్రం పోయేదేముంది.. వచ్చేదేముంది.. అంతా అయిపోయిందిగా అని కొందరు అంటుంటే.. మరికొందరు నెటిజన్లు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆ పని చేశాడని అంటున్నారు. మరి ఈ విషయమై శిల్పాశెట్టి ఎలా స్పందిస్తుందో చూడాలి.