కెరీర్ పీక్స్‌లో ఉండగానే ప్రియుడ్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి స్టెప్ ఇన్ అయ్యింది మహానటి కీర్తి సురేష్. మ్యారేజ్ చేసుకున్నాక గ్లామర్ డోర్స్ తెరిచేందుకు ఛాన్స్ ఉండదనుకుందో లేక కథ డిమాండో మరైదైనా రీజనో బాలీవుడ్ ఎంట్రీ బేబీజాన్‌తో కాస్తంత స్కిన్ షో చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో చేసిందీ వృథాగా మారింది. ఇక పెళ్లికి ముందే తెరకెక్కించిన అక్క వెబ్ సిరీస్‌లో కూడా కాస్తంత హాట్‌గా కనిపించనుంది కీర్తి.
Also Read : Exclusive : ఎన్టీఆర్ – నీల్ సినిమా కోసం యంగ్ రైటర్
ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్న కీర్తి సురేష్ మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేయనుంది. ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చేసిన అమ్మడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దించేస్తోంది. రీసెంట్లీ రివాల్వర్ రీటా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది టీం. ఉమన్ సెంట్రిక్ కామెడీగా వస్తోన్న ఈ ఫిల్మ్ ఆగస్టు 27న థియేటర్లలోకి రాబోతుంది. అలాగే థియేటర్లలో కన్నా ముందుగా ఓటీటీలో పలకరించబోతుంది కీర్తి. సుహాస్ హీరోగా నటిస్తోన్న ఉప్పుకప్పురంబు ఫిల్మ్ జులై 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్వరలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల టచ్‌లోకి వచ్చేస్తోంది మహానటి. ఇవే కాదు తమిళంలో కన్నివీడి చేస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ రౌడీ జనార్థనాతో పాటు బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎల్లమ్మలో మహానటినే ఫైనల్ అయ్యినట్లు టాక్. అలాగే బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్. పనిలో పనిగా ఎప్పుడో కంప్లీటైన నెక్ట్ ఫ్లిక్స్ సిరీస్ అక్క ఓటీటీలోకి త్వరలోనే తెచ్చేందుకు ప్రయత్నిస్తోందట కీర్తి.