యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Also Read : Rajnikanth : జైలర్ 2 లో బాలీవుడ్ కింగ్ ఖాన్.?
కాగా ఎన్టీఆర్ తో సినిమా కోసం ప్రశాంత్ నీల్ రెడీ చేసిన కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించాడట ఎన్టీఆర్. మరోక రెండు వర్షన్ లు రెడీ చేసి తారక్ కు వినిపించగా ఓకె కాలేదు. దాంతో నాగేంద్ర కాసి అనే యంగ్ రైటర్ ను ఈ సినిమా కోసం పిలిపించి మార్పులు చేర్పులు భాద్యతలను నాగేంద్రకు అప్పగించారు. అయితే ఫైనల్ వర్షన్ లో నాగేంద్ర చేసిన మార్పులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇంప్రెస్ అయ్యాడట. అల్లు అర్జున్ పుష్ప 2, ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమాలకు రైటింగ్ లో పనిచేసాడు నాగేంద్ర కాసి. ఇప్పడు ఎన్టీఆర్ సినిమాకు తనవంతు పాత్ర నిర్వహించాడు. కథ, కథనాలు అన్ని సెట్ అవడంతో జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్నాడు ప్రశాంత్. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నఈ సినిమాకు కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. 25 జూన్ 2026 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డ్రాగన్.