Shah Rukh Khan Tweet About Karma: అపజయమన్నది అధఃపాతాళం చూపిస్తే, అఖండ విజయం అంబరమంటేలా చేస్తుందంటారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఘనవిజయంతో మేఘాల్లో తేలిపోతున్నారు. తన సోషల్ మీడియాలో అభిమానులను పలకరించే కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టారు. ‘ఆస్క్ ఎస్ఆర్‌కె’ అనే ట్యాగ్ తో ఫ్యాన్స్ ముందుకు మళ్ళీ వచ్చారాయన. దాంతో అభిమానులు ఆనందంతో మరింత ఉత్సాహంగా అందులో ఆయనతో ముచ్చటించడానికి పరుగు తీశారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ఏదైనా జోక్ పేల్చమని షారుఖ్ ను కోరాడు. అసలే సక్సెస్ మత్తులో ఉన్న షారుఖ్ ఊరకే ఉంటాడా? ఆయన కూడా అభిమాని ఉరకలు వేసే ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకటి వదిలారు.
Prithvi Show Issue: పృథ్వీ షా గొడవలో కొత్త ట్విస్ట్.. రివర్స్‌లో కేసు పెట్టిన సప్నా గిల్
ఇంతకూ షారుఖ్ ఖాన్ ఫ్యాన్ కు చెప్పిన జోక్ ఏమిటంటే- “ఓ కొత్త రెస్టారెంట్ ఉంది. దానిపేరు కర్మ. అక్కడ మెనూ ఏమీ ఉండదు. నీకు దక్కాల్సింది నీకు దక్కుతుంది” అని సారాంశం! మరి ఆ అభిమాని ఈ జోక్ కు ఏ తీరున నవ్వుకున్నాడో కానీ, ఇందులో షారుఖ్ సినిమా ప్రయాణమే కనిపిస్తోందని కొందరు అంటున్నారు. సినిమా రంగం అనే రెస్టారెంట్ లో అందరూ ‘కర్మ’ను అసుసరిస్తూనే సాగుతుంటారని, కొందరికి అదృష్టం అచ్చివస్తే, మరికొందరికి అది దూరంగా జరుగుతూ ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అదే జీవితసత్యాన్ని షారుఖ్ జోక్ రూపంలో విశ్లేషించాడని వారు చెబుతున్నారు. ఎంతయినా షారుఖ్ ఖాన్ అనుభవంతో చెప్పిన ఆ మాటను ఆ అభిమాని ఏ తీరున తీసుకున్నాడో?
Kasturi: ఇంటింటి గృహలక్ష్మి హీరోయిన్ కు అస్వస్థత.. బుద్దిలేదు అని తిట్టిపోస్తున్న అభిమానులు