సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళుతోన్న త్రిషకు బ్రేకులేస్తోన్నాయి వరుస ప్లాపులు. 96, పేట, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు ఆమె గ్రాఫ్ అమాంతం పెంచేస్తే, ఐడెండిటీ, విదామయర్చి, థగ్ లైఫ్ చిత్రాలు కెరీర్‌నే డౌన్ ఫాల్ చేశాయి. ఈ ఏడాది నాలుగు సినిమాలు చేస్తే ఒక్క గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా థగ్ లైఫ్‌లో చెన్నై బ్యూటీ క్యారెక్టర్‌ను ఆమె ఫ్యాన్సే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి రోల్స్ అవసరమా అని ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read : SC, ST Controversy : విజయ్ దేవరకొండ పై SC, ST అట్రాసిటీ కేసు
సోషల్ మీడియాలో వస్తున్న దారుణమైన కామెంట్స్‌పై త్రిష స్పందించదు. ఆమె కంటూ స్పెషల్ మేనేజర్ అంటూ పీఆర్ లేకపోవడంతో స్ట్రాంగ్‌గా రెస్పాండ్ కాలేకపోతుంది. ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు రాళ్లు వేస్తూనే ఉంటారని నమ్మే త్రిష విమర్శలను లైట్ తీసుకుని సినిమాలపై ఫోకస్ చేస్తోంది. ప్రజెంట్ ఆమె చేతిలో త్రీ ఫిల్మ్స్ ఉన్నాయి. తమిళంలో కరుప్పుతో పాటు తెలుగులో విశ్వంభర చేస్తోంది చెన్నై చందమామ. సుమారు రెండు దశాబ్దాల తర్వాత అటు సూర్యతో, ఇటు చిరంజీవితో వర్క్ చేస్తోంది వర్షం బ్యూటీ. ఆరు హిట్ తర్వాత సూర్యతో జోడీ కట్టే ఛాన్స్ రాలేదు త్రిషకు. అలాగే స్టాలిన్ తర్వాత మెగాస్టార్‌తో వర్క్ చేయలేదు. కరుప్పు అండ్ విశ్వంభర చిత్రాలు ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. ఇవి ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో క్లారిటీ లేదు. ఇవే కాకుండా మేడమ్ సెకండ్ ఇన్నింగ్స్‌కు స్ట్రాంగ్ పునాది వేసిన 96 సీక్వెల్ చేస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కనుంది. మరీ సూర్య, చిరు, విజయ్ సేతుపతితో మరోసారి త్రిష మ్యాజిక్ హిట్ నమోదు చేస్తుందా లేదా రాబోయే రోజుల్లో తెలుస్తుంది.