SC, ST Controversy : విజయ్ దేవరకొండ పై SC, ST అట్రాసిటీ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పై SC, ST అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఇటీవల జరిగిన సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ వేడుకలో విజయ్ గిరిజనులను తీవ్రవాదులతో పోల్చాడు. విజయ్ దేవరకొండ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. దాంతో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసారు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్.
Also Read : Sandalwood : కన్నడలో మరో కాంట్రవర్సీ.. ఈ సారి హీరోయిన్ వంతు
Also Read
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ‘ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా, తీవ్రంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. 500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారు. అనే వ్యాఖ్యల ద్వార మా గిరిజన సమాజాన్ని అవమానపరిచారు. అంతేకాకుండా మమ్మల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చేలా వాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మా గిరిజనుల ఆత్మ గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇలాంటి వాఖ్యలు Scheduled Castes and Schduled Tribes (Prevention of Atrocities) Act, 1989 ప్రకారం శిక్షార్హమైనవిగా పరిగణించబడతాయి. కావున విజయ్ దేవరకొండ పై తక్షణమే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకోని మా గిరిజన సమాజానికి న్యాయం చేస్తారని గాఢంగా నమ్ముతున్నాము’ అని పేర్కొన్నారు. గిరిజన సంఘాల ఫిర్యాదుతో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!