టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, అత్త పాత్రల్లో ఆమె నటన అద్భుతం. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సుధ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తాను ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన అవమానాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ సెట్ లో అందరిముందు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
” నా కెరీర్ మొదట్లో నేను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేశాను. తమిళ్ సినిమాలో ఒక సాంగ్ షూట్ జరుగుతుంది. అప్పుడు సుందరం మాస్టర్ నాతో డాన్స్ మూమెంట్స్ నేర్పిస్తున్నారు. ఐదు టేకులు తీసుకున్నా మూమెంట్ పర్ఫెక్ట్ గా రాలేదు. దీంతో ఆయన నా మీద అరిచారు. చాలా అసభ్యంగా మాట్లాడారు. నువ్వు వ్యభిచారానికి కూడా పనికి రావు అని అభ్యంతరకరమైన మాటలు అనేశారు. సెట్ లో ఎంతోపేద్ధ వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ మాటలకు నేను చాలా బాధపడ్డాను. ఇంటికి వెళ్లి మా అమ్మకు చెప్పి వెక్కివెక్కి ఏడ్చాను. ఒక ఆర్టిస్ట్ ని ఆయన అలా అనడం పద్దతి కాదని” ఆవేదన చెందారు. ప్రస్తుతం సుధ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. సుందరం మాస్టర్ ఈ విధంగా మాట్లాడారు అంటే నమ్మలేకపోతున్నాం అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నటీనటులకు కెరీర్ మొదట్లో ఇలాంటి అవమానాలు తప్పవు.. వాటన్నింటినీ ఎదిరించి నిలబడినప్పుడే సక్సెస్ వస్తుంది అని మరికొందరు సుధకు ధైర్యం చెప్తున్నారు.