ఈ వీకెండ్ తెలుగులో ఓ అనువాద చిత్రంతో కలిపి మొత్తం ఐదు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో రెండు సినిమాలు శుక్రవారం, మూడు చిత్రాలు శనివారం రిలీజ్ కాబోతున్నాయి.
ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన 'గోల్కొండ హైస్కూల్' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్, 'తను నేను' చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు.