తమిళ హాస్య నటుడు సంతానం పరిచయం అక్కర్లేనిపేరు. వడివేలు హావ తగ్గిన తర్వాత సంతానం స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాలు నుండి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలో సంతానం ఉండాల్సిందే. షార్ట్ పంచ్ లతో యూనిక్ డైలాగ్ డెలివరీతో నవ్వించడం సంతానం స్పెషల్. నేనే అంబానీ, శకుని, సింగం సినిమాలలో సంతానం టాలీవుడ్ ఆడియెన్స్ కు సుపరిచితమే. ఎన్నో సినిమాల సక్సెస్ లో సంతానం కీలకం అని చెప్పాలి. మనోడు ఉంటే సినిమాకు మినిమం గ్యారెంటీ అనే టాక్ ఉంటది.
Also Read : Indra Ram : చౌర్యపాఠం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
సంతానం హావ తమిళ సినీపరిశ్రమలో పీక్స్ లో ఉన్న టైమ్ లో కమెడియన్ గా సినిమాలు చేయనని ప్రకటించాడు. ఎందరో కమెడియన్స్ లాగా తాను కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేసి కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. ఆ విధంగా సక్సెస్ కూడా అయ్యాడు. అలాగే డిజాస్టర్ సినిమాలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు సంతానం మరోసారి కమెడియన్ గా నటించబోతున్నాడనే వార్త తమిళ సిని వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కోలీవుడ్ యంగ్ హీరో శింబు హీరోగా తన 49వ సినిమా చేస్తున్నాడు. రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంతానం నటిస్తున్నాడు. అయితే అది కమెడియన్ కాదని సెకండ్ హీరో స్థాయిలో ఉంటుందని సమాచారం. అలాగే ఈ సినిమాకు సంతానం ఏకంగా రూ. 7 కోట్లు తీసుకోబోతున్నాడట. యంగ్ సెన్సేషన్ సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మరియు కయాడు లోహర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.