Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం ఆ కటౌట్ కు ఇచ్చే వాల్యూ అలాంటిది. ఇండస్ట్రీలో వివాదాలు లేని హీరో ప్రభాస్. అందరిని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. అందుకే ఆయనకు ఏదైనా జరిగితే అందరి ప్రాణాలు విలవిలలాడతాయి. ఇక హీరోలు అన్నాకా.. యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు దెబ్బలు తగలడం సహజం. కొన్నిసార్లు వాటి ఎఫెక్ట్ జీవితాంతం ఉంటుంది. ఇక బాహుబలి సమయంలో ప్రభాస్ కు మొకాలుకు దెబ్బ తగలడం.. దానికి సర్జరీ జరగడం తెలిసిందే. దానివల్లనే ఇప్పటికీ ఆయన సరిగ్గా నడవలేకపోతున్నాడు. ఇక దీనికన్నా ముందు ప్రభాస్ కు ఒక పెద్ద ప్రమాదం తప్పిందట. ఆ విషయాన్నీ హీరోయిన్ సంజన గల్రాని బయటపెట్టింది. బుజ్జిగాడు సినిమాలో ఆమె ప్రభాస్ సరసన నటించింది. నేటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్లు అయిన సందర్భంగా ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈ ప్రమాదం విషయం వైరల్ గా మారింది.
Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ మృతి అంటూ ప్రచారం.. నమ్మకండి
” బుజ్జిగాడు సినిమా అనగానే నాకు గుర్తొచ్చేది ప్రభాస్. ఆయన చాలా తక్కువ మాట్లాడినా ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. ముఖ్యంగా బుజ్జిగాడు సెట్ లో గుర్తుండిపోయే కాదు కాదు.. ఎంతో భయపెట్టిన ఘటన అది. నేను కార్ వ్యాన్ లో నుంచి దూకి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ ప్రభాస్ ను పలకరించాను. బస్సులో వస్తున్న సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అప్పుడు నేను బస్సు లో లేను.. ఒక షాట్ తీస్తుండగా.. ప్రభాస్ బస్సులో ఉంచి కిందపడ్డాడు. బస్సు మొత్తం ఆయన కింద ఉంది. రోడ్డు మీద ఆయన అలా పడిపోయారు. బస్సు ఆయన మీద నుంచి వెళ్ళిపోయింది. మధ్యలో ఆయన ఉండడంతో ఏమి కాలేదు. వెంటనే అక్కడఉన్నవారు.. కార్ వ్యాన్ లో ఉన్నారు అందరూ ప్రభాస్ దగ్గరకు వెళ్లి.. అన్నా.. ఏం కాలేదుగా.. అంటూ విలవిలలాడిపోయారు. ఇక ప్రభాస్ మాత్రం కూల్ గా ఓకే నేను బాగానే ఉన్నాను అని చెప్పారు. హీరోలు.. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు.. బాడీ ఫిట్ గా ఉంటారు. కానీ వయస్సు పెరిగేకొద్దీ..బాడీ పెయిన్స్, బాడీలో రాడ్స్, దెబ్బలు, కనిపిస్తాయి. ఆ సమయంలో ప్రభాస్ ను అలా చూసి పానిక్ అయిపోయాం. నిజంగా ఆయన దేవుడి బిడ్డ.. అందుకే ఆయనకు ఏమి కాలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలు విన్న ప్రభాస్ అభిమానులు.. దేవుడా.. ప్రభాస్ కు అంత పెద్ద ప్రమాదం జరిగిందా అని కొందరు.. నిజంగా దేవుడు ఉన్నాడు.. అందుకే ప్రభాస్ అన్నకు ప్రమాదం తప్పింది అని కామెంట్స్ పెడుతున్నారు.