Comedian Sudhakar: టాలీవుడ్ స్టార్ కమెడియన్ సుధాకర్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటితరానికి ఆయన కామెడీ గురించి తెలియకపోవచ్చు. కానీ, 90s కిడ్స్ ను ఆయన కామెడీ గురించి చెప్పమంటే కథలు కథలుగా చెప్పుకొస్తారు. విలన్ గా, కామెడీ హీరోగా, స్టార్ కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన ప్రస్తుతం అనారోగ్యం పాలయ్యారు.గత కొన్నేళ్లుగా ఆయనకు చికిత్స జరుగుతుంది. అయితే నిన్నటి నుంచి ఆయన మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం రిప్ సుధాకర్ అంటూ పోస్ట్లు ప్రత్యేక్షమయ్యాయి. దీంతో ఆయన అభిమానులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ కు ఏమి కాలేదని, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. అసత్య ప్రచారాలు చేయవద్దని, చనిపోని మనిషిని మీ వ్యూస్ కోసం చంపేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో ఆ ఫేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.
Salaar: ఎంత పని చేశారయ్యా.. ఇప్పుడు అప్డేట్స్ తెలిసేది ఎలా..?
ఇకపోతే సుధాకర్ చివరగా సూర్య నటించిన గ్యాంగ్ అనే సినిమాలో రమ్యకృష్ణ భర్తగా నటించాడు. ఆయనకు ఆరోగ్యం బాగోడంలేదని అందరికి తెల్సిందే. కానీ, మరీ చనిపోయాడు అని చెప్పడం దారుణమని, కొన్ని కొన్ని నిజాలు తెలుసుకొని రాయాలని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక సుధాకర్ విషయానికొస్తే.. ఆయన కెరీర్ మొదట్లో చిరంజీవితో పాటు ఒకే రూమ్ లో ఉండేవాడు. ఆ తరువాత భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన కీళుక్కెం పోగుమ్ రెయిల్ అనే సినిమాతో కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో సుధాకర్ సరసన హీరోయిన్ రాధిక నటించింది. ఆ తరువాత ఆయన టాలీవుడ్ లో విలన్ గా ఎంటర్ అయ్యి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.