Sandeham Manase marala Lyrical Video Released: హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సందేహం’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ మీద సత్యనారాయణ పర్చా నిర్మాతగా నిర్మించారు. ‘సందేహం’ ‘షి బిలీవ్డ్’ అనే ట్యాగ్ లైన్ తో లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ మూవీకి ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హెబ్బా సరసన హీరోగా ఈ సినిమాలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోండగా మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన సినిమా యూనిట్ థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేసింది. ‘మనసే మరలా’ అంటూ సాగే ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉందని చెప్పొచ్చు.
Pushpa 2: ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టిన పుష్ప 2
ఎస్పీ చరణ్, కే ప్రణతిలు ఆలపించిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం సుభాష్ ఆనంద్ బాణీలు చక్కగా కుదిరాయి. ఇక ఈ లిరికల్ వీడియోలో హెబ్బా పటేల్, సుమన్ వూటుకూరిల పాత్రల తీరు కూడా ఆసక్తి రేపుతోంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలో చూపించారని చెప్పచ్చు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన కూడా వచ్చింది. టైటిల్, ఫస్ట్ లుక్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు.