రౌడీ హీరో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ప్యూర్ లవ్ స్టొరీగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఒక షెడ్యూల్ ని ఇప్పటికే కాశ్మీర్ ప్రాంతంలోని మంచు కొండల మధ్య పూర్తి చేసుకుంది. సమంతా పుట్టిన రోజు వేడుకలని కూడా ఖుషి మూవీ సెట్స్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా చేశారు. ఆ తర్వాత సమంతా ఆరోగ్యం బాగోలేక పోవడం, డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోతుంది అంటూ సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపించాయి. దీంతో ఖుషి మూవీ అటకెక్కింది అనే వార్త ఫిల్మ్ నగర్ లో వైరల్ అయ్యింది. ఈ రూమర్ కి ఎండ్ కార్డ్ వేస్తూ త్వరలో ఖుషి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చేశాడు.
Read Also: Bobby Simha: మూడు భాషల్లో ఒకేసారి ‘వసంత కోకిల’!
“#khushi regular shoot will start very soon. everything is going to be beautiful” అంటూ శివ నిర్వాణ ట్వీట్ చేశాడు. సమంతా టీం కూడా ఆమె ఏ సినిమా నుంచి తప్పుకోలేదు అని త్వరలో సైన్ చేసిన సినిమా షూటింగ్స్ కి అటెండ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఖుషి మూవీ ఆగిపోయింది అనే రూమర్ కి ఎండ్ కార్డ్ పడింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి మలయాళం ‘హ్రిద్యం’ ఫేమ్ ‘హేషం అబ్దుల్ వాహబ్’ మ్యూజిక్ అందిస్తున్నాడు. డిసెంబర్ 2022లోనే ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఖుషి మూవీ కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చెయ్యాల్సి ఉంది.
#khushi regular shoot will start very soon 👍
everything is going to be beautiful❤️— Shiva Nirvana (@ShivaNirvana) January 30, 2023
Read Also: Pawan Kalyan: జస్ట్ అలా నడిచాడు అంతే సోషల్ మీడియాలో సునామీ వచ్చింది