Bobby Simha: మూడు భాషల్లో ఒకేసారి ‘వసంత కోకిల’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha Kokila: ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘వసంత కోకిల’. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సారధ్యంలో నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా ‘నర్తనశాల’ ఫేమ్ కాశ్మీర పర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై అంతటా విశేషాదరణ అందుకుంది. అలానే రేజ్ ఆఫ్ రుద్ర’ పేరిట వచ్చిన మోషన్ పోస్టర్ కూ మంచి స్పందన లభించింది. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది. తెలుగు, తమిళ వర్షన్స్ లో ఆర్య పోషించిన పాత్రను కన్నడలో రక్షిత్ శెట్టి చేశాడు.
సినిమా జానర్ కి, బాబీ సింహా అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కి తగిన విధంగానే దర్శకుడు రమణన్ ‘వసంత కోకిల’ను తెరకెక్కించారని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. జాతీయ అవార్డు గ్రహిత, విలక్షణ కథానాయకుడు కమలహాసన్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ‘వసంత కోకిల’ ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోనూ మరో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించడం విశేషం. మూడు భాషల్లోనూ ‘వసంత కోకిల’ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఆ తేదీన నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’, సాయిరోనక్ ‘పాప్ కార్న్’ మూవీస్ విడుదలకు రెడీ అవుతున్నాయి.
Also Read
- Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
- IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన 'ఇరుముడి'
- Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
తాజావార్తలు
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..