Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం పోస్టు చేసినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ ఏదో ఒక కొటేషన్ ను తన లైఫ్ కు సూట్ అయ్యేలా పోస్టు చేయడంతో అవి కాస్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి ఇన్ స్టాలో స్టోరీ పెట్టేసింది. ఇతరుము మన గురించి ఏం అనుకున్నా పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే మానసిక ప్రశాంతత ఉండదు. ఎవరేం మాట్లాడినా మన పని మనం మరవొద్దు. ఏది చేయాలో మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ పని నేను చేయాలి అని కాకుండా.. నేను చేయాల్సిందే అన్నట్టు మనం ఫిక్స్ అవ్వాలి.
Read Also : Kingdom : అయోమయంలో కింగ్ డమ్.. ఏ డేట్ కు వస్తాడో..?
అప్పుడే మనం లైఫ్ లో సక్సెస్ అవగలం. మనం పెట్టుకునే లక్ష్యాలు మన ఆత్మగౌరవం కోసమే. అంతేగానీ ఒత్తిడితో ఇబ్బంది పడటానికి కాదు అంటూ రాసుకొచ్చింది. ఆమె చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి ఎందుకు ఈ పోస్ట్ చేసిందో అంటూ ఆరా తీస్తున్నారు. సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.
వాటిని పట్టించుకోను అని చెప్పడానికే ఈ పోస్టు చేసిందేమో అంటున్నారు. ఏదేమైనా సమంత పోస్టులు ఇలా చర్చకు దారి తీయడం అందరికీ పరిపాటిగా మారిపోయింది. ప్రస్తుతం సమంత దుబాయ్ టూర్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. ఖుషి సినిమా తర్వాత తెలుగులో నటిగా మరో సినిమా చేయలేదు.
Read Also : Mega-Anil Movie : మెగా-అనిల్ సినిమా.. జాయిన్ కాబోతున్న వెంకీ..