Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. సాహు గారపాటి, సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ముహూర్తం రోజునే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. అతి త్వరలోనే వెంకటేశ్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడంట. ఇందులో ఆయనది చాలా కీలక పాత్ర అని తెలుస్తోంది. రీసెంట్ గానే మూవీ టీమ్ ముస్సోరిలో ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.
Read Also : Nagarjuna : కుబేరలో నాదే మెయిన్ రోల్.. నాగార్జున కామెంట్స్
త్వరలోనే స్టార్ట్ కాబోయే షెడ్యూల్ లో వెంకటేశ్ జాయిన్ అవుతాడు. నెల రోజుల పాటు డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ఆయన పాత్ర లెంగ్త్ కొంచెం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. పూర్తి కామెడీ ట్రాక్ లో మూవీని తీస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత పూర్తి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో వింటేజ్ చిరు కనిపిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
ఈ నడుమ మూవీలో ఎవరు నటిస్తున్నా స్పెషల్ వీడియోతో వారి అనౌన్స్ మెంట్ జరుగుతోంది. మరి వెంకటేశ్ మూవీలో జాయిన్ అయ్యే టైమ్ లో ఏదైనా స్పెషల్ వీడియో ఉంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. చిరంజీవి-వెంకటేశ్ చాలా ఏళ్ల తర్వాత ఒక సినిమాలో కనిపిస్తున్నారు. వెంకీ చాలా మందితో మల్టీ స్టారర్ మూవీలు చేస్తున్నాడు. అనిల్ తో ఇది వెంకీకి నాలుగో సినిమా.
Read Also : Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !