Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చెప్పినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. సమంత అటెన్షన్ అలా ఉంటుంది మరి. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చెప్పే మాటలు, చేస్తున్న పనులు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక ఆమె ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కలిసి తిరుగుతోంది. ఆమె ఎప్పుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది.
Read Also : Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం
నేను చాలా సినిమాల్లో మంచి పాత్రలే చేశాను. నేను సెక్సీగా ఉంటానని నాకు ఎప్పుడూ అనిపించలేదు. డైరెక్టర్లు కూడా నాకు బోల్డ్ పాత్రలు ఇవ్వలేదు. ఏ పాత్ర ఇచ్చినా వంద శాతం కష్టపడి సినిమాలు చేశాను. డెడికేషన్ తో వర్క్ చేయడమే నేను నేర్చుకున్నాను. అదే నన్ను ఈ రోజు ఇలా నిలిపింది అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత పుష్ప సినిమాలో మాత్రమే కాస్త బోల్డ్ గా డ్యాన్స్ చేసింది. అందకు మించి పెద్దగా బోల్డ్ పాత్రలు చేయలేదు.
Read Also : Shivani Nagaram : ఆ హీరో కోసం ఏం చేయడానికైనా రెడీ.. క్రేజీ హీరోయిన్ కామెంట్