Samantha: సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది ఆమె నటించిన ఖుషీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో విజయ్ దేవరకొండ.. వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే . అయితే హెల్త్ బాగోలేని కారణంగా సమంత.. ఈ ప్రమోషన్స్ లో పాల్గొనలేదని మేకర్స్ తెలిపారు. ఇక ఒక సినిమా ఒప్పుకుంటే.. ఏ స్టార్ హీరోయిన్ అయినా కూడా ప్రమోషన్స్ కు వస్తాను అని చెప్పి .. అందుకు తగ్గ రెమ్యూనిరేషన్ తీసుకుంటారు. ఇక సామ్ కూడా అలాగే అగ్రిమెంట్ చేసుకున్నది కూడా. కానీ, ఈ మధ్యలో అనుకోని సంఘటనలు చాలా జరిగాయి. దీంతో సామ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నదట.
Trisha: త్రిషకు కులపిచ్చి.. ఒక హీరో ఆమెను తాకరాని చోట తాకినా.. నటి సంచలన వ్యాఖ్యలు
ప్రమోషన్స్ కు రానీ కారణంగా నిర్మాతలు చాలా డబ్బును పోగొట్టుకున్నారని తెలిసి.. ఆమె తన రెమ్యూనిరేషన్ లో రూ. కోటి తిరిగి ఇచ్చేసిందని సమాచారం అందుతుంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆమె పెద్ద మనసుకు ఫిదా అవుతున్నారు. అది సమంత అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరోపక్క ఈ సినిమాపై సామ్, విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఇప్పటికే విజయ్ లైగర్ ప్లాప్ తో ఉండగా .. సామ్ కూడా యశోద లాంటి సినిమాతో పరాజయాన్ని చవిచూసి ఉంది. ఈ సినిమా హిట్ పైనే వీరి కెరీర్లు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.