Trisha: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో ఆమె గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. 4 పదుల వయస్సులో కూడా ఆమె తన అందంతో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష గురించి మరో కోలీవుడ్ నటి మీరా మిథున్ సంచలన కామెంట్స్ చేసింది. మీరా గురించి చాలామందికి తెలుసు. కోలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. బిగ్ బాస్ కు వెళ్లి అక్కడ వివాదాలు పెట్టుకొని బయటకు వచ్చింది. ఇక గతంలో కూడా త్రిషపై సంచలన వ్యాఖ్యలు చేసింది. త్రిషకు కులపిచ్చి అని, ఆమె వలన తాను చాలా సినిమాలను పోగొట్టుకున్నాను అని విమర్శించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక అదే మీరా.. ఇప్పుడు త్రిషపై పాజిటివ్ గా మాట్లాడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో త్రిష ఎదుర్కున్న ఒక చేదు అనుభవాన్ని తెలిపింది.
Chiranjeevi: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ ను వదులుకున్న చిరు.. అది కనుక చేసి ఉంటేనా
” ఒక సినిమాలో నేను.. త్రిష కలిసి పనిచేశాం. ఒక సీన్ షూట్ చేసేటప్పుడు ఆ సినిమాలో నటిస్తున్న ఒక నటుడు త్రిషను తాకకూడని చోట.. పదేపదే తాకుతున్నాడు. అది చూసి నాకు ఒళ్లు మండింది. త్రిష కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. అయినా కూడా ఆమె సైలెంట్ గా నిలబడింది. ఎక్కడ అరిస్తే సినిమాలో ఛాన్స్ పోతుందో అని.. స్టార్ హీరోయిన్లకే ఇలాంటి బాధలు తప్పలేదు. మాలాంటి వారు ఎంత” అని చెప్పుకొచ్చింది. అయితే ఒకప్పుడు నెగెటివ్ గా మాట్లాడిన ఆమె గురించి ఇలా పాజిటివ్ గా మాట్లాడం వెనుక కారణం ఏంటి.. ? అని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం .. ఏ విషయంలో వారికి బేధాభిప్రాయాలు ఉన్నా.. అమ్మాయిలు ఈ విషయంలో కలిసి ఉంటారు అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మీరా మిథున్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.