Samantha: తుతన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడనని స్టార్ హీరోయిన్ సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఆమె నిర్మాతగా మారి “శుభం” అనే ఒక సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవున్న నేపథ్యంలో తాజాగా సమంత మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి, “మీరు నటిగా సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యి ఇప్పుడు నిర్మాతగా మారారు, అంటే మీరు ఒకరకంగా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. అయితే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, మీలో ఏం ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది? ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్‌లో జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలు ఏమైనా షేర్ చేసుకోగలరా?” అని అడిగితే, దానికి ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
Read Also : Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓజీ షూటింగ్ అప్డేట్
అదేమిటంటే, “నేను పర్సనల్ విషయాలు ఎక్కడా మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యాను. ఈ విషయం నేను నేర్చుకున్నాను,” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి సమంత తన పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడిన నేపథ్యంలో, ఆమె బ్లేమ్ గేమ్ ఆడుతోంది, సింపతి కార్డ్ వాడుతోంది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఆమె మీద కామెంట్స్ చేశారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఈ విషయం గురించే ఎక్కువ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె తాను పర్సనల్ విషయాల గురించి మాట్లాడదలచుకోలేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also :Zero Shadow : 9 రోజుల దాకా నీడ మాయం.. ఎందుకంటే..?