Samantha: తుతన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడనని స్టార్ హీరోయిన్ సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఆమె నిర్మాతగా మారి “శుభం” అనే ఒక సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవున్న నేపథ్యంలో తాజాగా సమంత మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి, “మీరు నటిగా సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యి ఇప్పుడు నిర్మాతగా మారారు, అంటే మీరు…