Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తరచూ ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ చిట్‌చాట్‌లో సమంత చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు పుట్టబోయే బిడ్డకు మంచి పేరు సూచించాల్సిందిగా ఇటీవల అభిమానులకు సమంత చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి ఓ అభిమాని స్పందిస్తూ.. సామ్‌కి పాప పుడితే ‘సమైరా’, బాబు పుడితే ‘సామ్రాజ్’ అని పేర్లు పెట్టాలని సూచించారు. సమంత పేరులోని ‘సామ్’, ఆమె భర్త, ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరుది ‘రాజ్’ కలిపి ‘సామ్రాజ్’ పేరును ఆ అభిమాని కామెంట్ చేశారు.
అభిమాని సూచనపై సమంత తనదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ముఖ్యంగా ‘సామ్రాజ్’ పేరును ఉద్దేశిస్తూ.. “మన గురించి మనమే కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అనిపించడం లేదా?” అంటూ నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. తన పేరు, భర్త పేరును కలిపి పెట్టిన పేరు కాస్త ఆత్మస్తుతిలా అనిపిస్తోందనే ఉద్దేశంతో సామ్ చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, గత జూన్‌లో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన సమంత.. అప్పటి నుంచి మాతృత్వానికి సంబంధించిన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల తాను 11 కిలోల బరువు పెరిగినట్లు కూడా సోషల్ మీడియాలో వెల్లడించారు. తాజాగా బిడ్డ పేరు విషయంలో ఆమె చేసిన ఈ సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
- Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
తాజావార్తలు
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!