Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhari vs Toxic: తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గాంధారి’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కనికా కపూర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత తాప్సీ పాత్రపై ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరో చుట్టూ తిరిగే గ్లామర్ పాత్రలో కాకుండా, తనకంటూ ఒక లక్ష్యం ఉన్న మహిళగా చూపించిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో కొందరు ప్రేక్షకులు ‘గాంధారి’ని ఇటీవల విడుదలైన యష్ నటించిన ‘టాక్సిక్’తో పోల్చడం మొదలుపెట్టారు. ఈ రెండు సినిమాల్లో మహిళా పాత్రలను చూపించిన విధానంలో చాలా తేడా ఉందంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగానే చర్చ జరుగుతోంది. ‘గాంధారి’ ట్రైలర్లో తాప్సీ పోషించిన పాత్ర కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. కూతురు కోసం పోరాడే తల్లిగా, కళ్ళు కూడా కనిపించని ఆమె చేసే పోరాటం సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే తాప్సీ పాత్రను చూసిన కొందరు నెటిజన్ల నుంచి ఆమెకు ప్రశంసలు వస్తున్నాయి.
ఇదే సమయంలో ‘టాక్సిక్’ సినిమాలో హీరోయిన్స్ పాత్రలపై కూడా చర్చకు వస్తోంది. యష్ ప్రధాన పాత్రలో గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్స్ కు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయాలను కొందరు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్స్ కేవలం హీరోతో సాగే సన్నిహిత సన్నివేశాల చుట్టూనే కనిపించారని, ‘గాంధారి’ సినిమాతో పొలుస్తూ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు ‘గాంధారి’ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ రెండు సినిమాల మధ్య పోలికలు మరింత ఎక్కువయ్యాయి. ఒక మహిళకు తనకంటూ ఒక లక్ష్యం, ఒక నిర్ణయం ఉండటం ఎంత ముఖ్యమో ‘గాంధారి’లో చూపిస్తున్నారని కొందరు చెబుతున్నారు. మరోవైపు ‘టాక్సిక్’లో మహిళా పాత్రలు బోల్డ్ గానే కనిపించాయని విమర్శిస్తున్నారు. ఈ కారణంగానే ‘గాంధారి’లో తాప్సీ పాత్రకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోందని తెలుస్తోంది.
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
ఈ చర్చలో మరో ఇంట్రెస్టింగ్ అంశం కూడా బయటకు వచ్చింది. ‘గాంధారి’, ‘టాక్సిక్’ రెండు సినిమాలకు మహిళా రచయితలే పనిచేయడం గురించి కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. కథను రాసే వ్యక్తి మహిళ అయినంత మాత్రాన సినిమాలో మహిళా పాత్రలు ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదని కొందరు అంటుంటే, సమాజానికి ఉపయోగపడేలా కథలు ఉండాలని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. నిజానికి ఇండియన్ సినిమాల్లో హీరోయిన్స్ పాత్రల విషయంలో ప్రేక్షకుల అంచనాలు కూడా క్రమంగా మారుతున్నాయి. గతంలో హీరోలకు జోడీగా హీరోయిన్స్ కనిపించడం, పాటలకే పరిమితమైన పాత్రలను ఆడియన్స్ కూడా ఎక్కువగా చూసేవాళ్లు. ఇప్పుడు మాత్రం కథలో మహిళా పాత్రలకు కూడా బలమైన కంటెంట్ ఉండాలని ప్రేక్షకులు ఎక్కువగా కోరుకుంటున్నారు. హీరోయిన్ పాత్రకు ప్రత్యేకమైన బ్యాక్‌స్టోరీ, బలమైన నిర్ణయాలు, భావోద్వేగాలు, కథను ప్రభావితం చేసే స్థానం ఉంటే సినిమాపై ఆసక్తి కూడా పెరుగుతోంది.
‘గాంధారి’ విషయంలో ఇప్పటివరకు వచ్చిన స్పందనను చూస్తే, తాప్సీ పాత్ర ఈ మారుతున్న అంచనాలకు తగ్గట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ‘గాంధారి’ ట్రైలర్‌తో మొదలైన ఈ చర్చ ఇప్పుడు ‘టాక్సిక్’ వరకు వెళ్లింది. ఒక సినిమాలో మహిళా పాత్రకు లక్ష్యం ఉంటే ఎలా ఉంటుందనే అంశంపై నెటిజన్లు చర్చిస్తున్నారు. మరి తాప్సీ పోషించిన గాంధారి పాత్ర నిజంగానే ప్రేక్షకులు కోరుకుంటున్న కొత్త తరహా మహిళా పాత్రలకు ఉదాహరణగా నిలుస్తుందా? సినిమా విడుదలైన తర్వాతే దీనికి పూర్తి సమాధానం దొరకనుంది.
ఇక తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ హై-ఇంటెన్సిటీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘గాంధారి’ (Gandhari) 2026 సెప్టెంబర్ 3న నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో, కనికా ధిల్లాన్ కథ-నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. రైల్వే స్టేషన్లో కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడానికి ఒక తల్లి (తాప్సీ) చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాపై రివేంజ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ యాక్షన్ డ్రామా స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..