Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Don’t Trouble the Trouble: మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతోంది. అయితే ముందుగా అనుకున్న రిలీజ్ డేట్‌కు సినిమా థియేటర్లలోకి ఈ సినిమా రావడం లేదు. మేకర్స్ తాజాగా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
ఫహద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాకు శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాను సమర్పిస్తుండటంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వాస్తవానికి ఈ మూవీ 2026 సెప్టెంబర్ 11న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ ని మార్చారు. తాజాగా అక్టోబర్ 2, 2026న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథ కూడా చాలా కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది. హైదరాబాద్‌లో నివసించే సూరి అనే ఒక మెజీషియన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్న చిన్న మాయలు చేస్తూ తనదైన ప్రపంచంలో ఉండే సూరి జీవితంలోకి దివ్య అనే ఒక అమ్మాయి వస్తుంది. అయితే సూరి చేసిన ఒక మ్యాజిక్ కారణంగా దివ్య అనుకోకుండా కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత ఆమెకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని తెలుస్తుంది. దీంతో సూరి ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడు.
దివ్య సాధారణ అమ్మాయి కాదని, ఆమె ఒక మాయా జిన్ అని సూరికి అర్థమవుతుంది. తన కోరికలను నెరవేర్చగల శక్తి ఆమెకు ఉండటంతో సూరి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అక్కడి నుంచి మాయాజాలం, సరదా సంఘటనలు, ప్రమాదాలు, ఊహించని మలుపులతో కథ ముందుకు సాగుతుంది. ఫాంటసీ ఎలిమెంట్స్‌కు తోడు హైదరాబాద్ నేపథ్యం ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చని తెలుస్తోంది.
ఈ సినిమాలో కీలకమైన చిన్నారి దివ్య పాత్రలో సారా పాలేకర్ కనిపించనుంది. ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన కుమారుడి ప్రాజెక్ట్‌ను రాజమౌళి సమర్పిస్తుండటం ఈ సినిమాకు మరో ప్రత్యేకతగా మారింది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ తెలుగు ఒరిజినల్ సినిమాగా రూపొందుతోంది. దీంతో పాటు తమిళం, మలయాళంలో కూడా డబ్బింగ్ వెర్షన్లను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఇక ఫహద్ ఫాసిల్ చివరిగా ‘ఇదయం మురళి’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఫహద్ ‘కరాటే చంద్రన్’తో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో కనిపించనున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 11న రావాల్సిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఇప్పుడు అక్టోబర్ 2కి వాయిదా పడింది. ఫహద్ ఫాసిల్ లాంటి నటుడు, శశాంక్ యేలేటి దర్శకత్వం, ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణతో వస్తున్న ఈ ఫాంటసీ డ్రామా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!